పరిగి. జూలై 3 : కాంగ్రెస్ పాలనలో సాగు, తాగు నీరు కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. బిందెడు నీళ్ల కోసం ఆడబిడ్డలు మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా వికారాబాద్ జిల్లా పరిగి మండలం బర్కత్పల్లి గ్రామంలో తాగు నీరు కోసం గ్రామస్తులు రోడ్డెక్కారు. గత రెండు వారాలుగా తాగునీరు కోసం అవస్థలు పడుతున్నామని ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేపట్టారు.
అనంతరం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రెండు వారాలుగా పంచాయతీ సెక్రటరీ గ్రామానికి రావడం లేదని, తమ సమస్యని పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.