ఢాకా: ప్రతిష్ఠాత్మక ఆసియాకప్ టోర్నీకి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వికెట్‌కీపర్, బ్యాటర్ లిటన్‌దాస్ అనారోగ్య కారణాలతోఆసియాకప్నకు దూరమయ్యాడు.వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న లిటన్.. జట్టుతో కలిసి శ్రీలంకకు బయలుదేరలేదు. దాస్ స్థానంలో 30 ఏండ్ల వికెట్‌కీపర్, బ్యాటర్అన్ముల్ హక్బిజోయ్ ఎంపిక చేసినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.