అబద్ధాల్లో కాంగ్రెస్ నేతల పోటీ
సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే ర్యాంకుల కోసం కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతూ కేసీఆర్ కుటుంబంపై అభాండాలు వేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజమెత్తారు.
- సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే ర్యాంకుల కోసం కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలపై నిందలు
- ఎంపీ చామలవి పిచ్చి ప్రేలాపనలు
- కాంగ్రెస్ నేతలపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు ధ్వజం
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే ర్యాంకుల కోసం కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పడంలో పోటీపడుతూ కేసీఆర్ కుటుంబంపై అభాండాలు వేస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని 2000 ఎకరాల భూములు కొల్లగొట్టిన కాంగ్రెస్ నాయకులు గురివిందగింజ చందంగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పడంలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నంబర్‌వన్ అయితే బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్, వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, ఆది శ్రీనివాస్ ఆ తర్వాతస్థానాల్లో ఉన్నారని దెప్పిపొడిచారు. శనివారం తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతుంటే.. బుద్ధిలేని చామల కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి కరువులేదని చెప్పడం శోచనీయమని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఘోర ఓటమి తప్పదని హెచ్చరించారు. వెయ్యి టీఎంసీల నీటిని గాలికొదిలేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు కరువు పేరిట గాలిమాటలు చెప్తూ కాలంవెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మునగానూరులో చామల అనుచరుడి భూ కబ్జా
భువనగిరి జిల్లా మునగానూరు గ్రామం సర్వే నంబర్ 44లో ఎంపీ చామల కిరణ్‌కుమార్ అనుచరుడు భూకబ్జా చేశారని బాలరాజు యాదవ్ ఆరోపణలు చేశారు. ‘చామల కిరణ్‌కుమార్‌రెడ్డి.. సంఘీసామ్రాట్ విల్లా వ్యవహారంలో పాత్ర తమకు తెలియదా? నీకు ఓటేసిన వారి గోడు పట్టించుకోరా? మైత్రీ కన్స్ట్రక్షన్స్లో నువ్వు ఏం చేస్తున్నావో చెప్పమంటావా? చామల ఫైల్స్ బయటపెట్టమంటావా?’అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంపీ అయిన తర్వాత యథేచ్ఛగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్ అమెరికానుంచి వచ్చిన వెంటనే మంత్రిని చేశారని అర్థపర్థంలేకుండా మాట్లాడడం చామలకే చెల్లిందని దెప్పి పొడిచారు.
కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాహుల్ సంతకం ఫోర్జరీ చేసి దొరికిపోయిన చామలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని చెప్పారు. కేసీఆర్ పాలనలో కాళేశ్వరం నిర్మించి రైతులకు నీరందించి వారి కన్నీళ్లు తుడిచారని చెప్పారు. కానీ రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత నీళ్లు, కరెంట్ ఇవ్వకుండా కన్నీళ్లు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి, ఆయన పరివారానికి దోపిడీపై ఉన్న ధ్యాస ప్రజలపై లేకుండాపోయిందని విమర్శించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

