ఎల్ నినో కాదు.. పాలకుల పాపం!
కరోనా కాలం గుర్తున్నదా? రాత్రికి రాత్రే ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య బందీ అయిపోయినప్పుడు, రేపటిదాకా బతుకుడెట్లనోనని ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే.. కేసీఆర్ ధైర్యం చెప్పిండ్రు. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికీ సాయం అందించిండ్రు. ఏ దరఖాస్తు లేదు.. ఏ పైరవీ లేదు.. ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఆపదొస్తే ఆదుకోవాలనే ఆలోచనకు అప్పట్లో కొదువ లేకుండె. మరి ఇప్పుడేమైంది? ఏడాది ముందునుంచే ఎల్ నినో ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ నిపుణులు హెచ్చరికలు చేసిండ్రు.
కరోనా కాలం గుర్తున్నదా? రాత్రికి రాత్రే ప్రపంచమంతా నాలుగు గోడల మధ్య బందీ అయిపోయినప్పుడు, రేపటిదాకా బతుకుడెట్లనోనని ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే.. కేసీఆర్ ధైర్యం చెప్పిండ్రు. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికీ సాయం అందించిండ్రు. ఏ దరఖాస్తు లేదు.. ఏ పైరవీ లేదు.. ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఆపదొస్తే ఆదుకోవాలనే ఆలోచనకు అప్పట్లో కొదువ లేకుండె. మరి ఇప్పుడేమైంది? ఏడాది ముందునుంచే ఎల్ నినో ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ నిపుణులు హెచ్చరికలు చేసిండ్రు. వానలు తగ్గొచ్చని శాస్త్రవేత్తలు చెప్తూనే వచ్చిండ్రు. అయినా నీటి నిల్వల మీద సర్కార్ సీరియస్గా దృష్టి పెట్టలేదు. విద్యుత్తు అవసరాల మీద ముందస్తు ప్రణాళికలు అమలు చేయలేదు. వచ్చిన నీటిని ఎట్ల ఒడిసిపట్టుకోవాల ధ్యాసనే పాలకులకు లేదు. చూస్తుండగానే తెలంగాణ మీదుగా దాదాపు వెయ్యి టీఎంసీల కృష్ణా, గోదావరి జలాలు ఆంధ్రా బాట పట్టినయ్. నీళ్లు కండ్లముందు నుంచి జారిపోయినంక… సాగునీరు లేదని, తాగునీరు కూడా కష్టమేనని, చావు కబురు చల్లగా చెప్పిండ్రు సీఎం. ఏడాదికి మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేసిన ఈ మోతెబరులు.. ఇప్పుడు రెండో పంటే వేయొద్దని రైతులకు హుకుం జారీ చేసే పరిస్థితికి వచ్చిండ్రు. దొంగలు పడ్డాక ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టున్నది ఈ వ్యవహారం. ముందే మేల్కొని నీళ్లు నిల్వ చేసుంటే, విద్యుత్తుకు ఏర్పాట్లు చేసుంటే ఈ దుస్థితి వచ్చేదా? వానలు సమయానికి రాలేదు సరే, కానీ వెయ్యి టీఎంసీల నీళ్లు పారిన సీజన్లో ఎవరి పండ్లు తోముతున్నరు సీఎం అండ్ కో. అందుకే ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు.
ప్రజలకు కాంగ్రెస్ కరెంటు షాక్!

తెలంగాణల కాంగ్రెస్ సర్కార్ చెప్తున్న ‘కరెంట్ ముచ్చట’ వింటుంటేనే జనాలకు షాక్ కొడుతున్నది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిబంధనల ప్రకారం థర్మల్ ప్లాంట్లలో కనీసం 20 నుంచి 25 రోజులకు సరిపడా బొగ్గు ఉండాలి. పైగా బొగ్గు నిల్వలను సమీక్షిస్తూ ప్రతీ వారం హెచ్చరికలు కూడా చేస్తారు. కానీ మన యాదాద్రి, కేటీపీఎస్, మణుగూరు ప్లాంట్లలో మాత్రం వారం రోజులకు మించి నిల్వల్లేవు! ఇందులో గమ్మతేందంటే.. బొగ్గు గనులే లేని పక్క రాష్ర్టాలు కర్ణాటక (రాయచూరు), ఏపీ (వీటీపీఎస్) మన సింగరేణి బొగ్గును హాయిగా తీసుకెళ్లి ఫుల్లుగా కరెంటు ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ మన బొగ్గు గనుల పక్కనే ఉన్న మన కేటీపీఎస్, మణుగూరు ప్లాంట్లకు మాత్రం బొగ్గు కొరత వచ్చిందట! ముందస్తు ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ కరెంట్ కష్టాలు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం గావాలె? ఇది చాలదన్నట్టు సీఎంది వింత ప్రవర్తన. కరెంటు కోతలపై అసహనం వ్యక్తంచేస్తూ .. ‘పని సక్కగ చేయకపోతే పెద్దాఫీసర్లను కూడా సస్పెండ్ చేస్తా’ అని వార్నింగ్ ఇచ్చిండ్రు. మళ్లీ తెళ్లారే ఏమైందో ఏమో ‘అధికారులూ మీ పనితనం సూపర్’ అని అభినందనల వర్షం కురిపించిండ్రు. ‘ముఖం మీద బురద జల్లి, నొసలు మీద బొట్టు పెట్టినట్టు’ లేదా ఈ ముచ్చట. ముందస్తు ప్రణాళికతో బొగ్గు నిల్వలు పెంచుకోవడం పక్కనబెట్టి, రోజుకో వింత ధోరణితో అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తే కరెంటు తయారైతదా?
కేసీఆర్ ధీమా, కాంగ్రెస్ ధోకా!

‘చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెత్త పనులు’ అన్నట్టున్నది సర్కార్ పెద్దల తీరు. ఏ పథకం తెచ్చినా అందులో ప్రజాసేవ తక్కువ, దోపిడీయే ఎక్కువ ఉన్నదనే తేలుతున్నది. తాజాగా ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పేరుతో వెయ్యి కోట్ల దందాకు పక్కా స్కెచ్ వేసినట్టు బయటపడింది. కేసీఆర్ హయాంలో ఎల్ఐసీ, బీహెచ్ఈఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు పూర్తి ధీమా ఇచ్చి ప్రోత్సహించారు. రైతుబీమాను నేరుగా ఎల్ఐసీ ద్వారా అమలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, దామరచర్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో బీహెచ్ఈఎల్కు భారీ ఆర్డర్లు ఇచ్చిండ్రు. ఎలాంటి బ్రోకరిజం లేకుండా పనులు నడిచాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు మాత్రం ప్రభుత్వ సంస్థలను పక్కనపెట్టి బ్రోకర్లను నమ్ముకున్నారనే సంగతి వెలుగుచూసింది. భవన నిర్మాణ కార్మిక బోర్డులోని రూ.1,800 కోట్లు, రైతుబీమా రూ.1,400 కోట్లు కలిపి మొత్తం రూ.4 వేల కోట్ల నిధులను మళ్లించి.. ప్రైవేట్ కన్సార్షియానికి కట్టబెడుతున్నారట. ప్రభుత్వానికి, ప్రైవేట్ కంపెనీకి నడుమ దళారీ కంపెనీ ఏర్పాటులో ముఖ్యనేత అల్లుడు ఫుల్ బిజీగా ఉన్నాడట. ఎల్ఐసీకి ఇస్తే రూపాయి కమీషన్ రాదు కదా, అందుకే ఏటా 10 శాతం కమీషనే లక్ష్యంగా మూడేండ్లలో రూ. 1,200 కోట్లు దిగమింగే ప్లాన్ వేసిండ్రట. ఐఆర్డీఏ పర్మిషన్ రాక జూన్ 2 పథకం వాయిదా పడినా, బ్రోకింగ్ దందా మాత్రం ఆగడం లేదు. అంటే బీమా అనేది పేదోడి కుటుంబానికి భరోసానివ్వాలి గానీ, పెద్దోళ్ల కమీషన్లకు కాదని పాలకులు గ్రహిస్తే మంచిది.
పాలనను పక్కకువెట్టి.. ఇవేం పనులు?

కాంగ్రెస్ సర్కారోళ్ల తీరు చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో జనాలకు అర్థమైతలేదు. సీఎం కుటుంబ వ్యాపారాలు, సొంత అవినీతి మీద ఎవరైనా ప్రశ్నిస్తే చాలు.. ‘ఇవన్నీ పెయిడ్ ప్రశ్నలు’ అంటూ తప్పించుకునే పని కొత్తగా మొదలువెట్టిండ్రు రేవంత్. ఇగ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి కేసీఆర్ వ్యవసాయక్షేత్రం మీద ఈకలు పీకుడే పనిగా పెట్టుకున్నరు. మొదట్లోనేమో అది వెయ్యెకరాల ఫాంహౌస్ అని ఆరోపించిండ్రు. అందులో 388 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నదని రచ్చ చేసిండ్రు. ఇప్పుడు రికార్డులు తిరగేసి లెక్కలు చూసేసరికి.. అదంతా ఉత్తదేనని సీఎంకే అర్థమైంది. అందులో అసలు అసైన్డ్ భూమే లేదని తేలిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తోచక ఏదేదో మాట్లాడుతుండ్రు. కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫాంహౌస్కు ప్రత్యేకంగా కాలువ తవ్వుకున్నరని లొల్లి షురూ చేసిండ్రు! నిజానికి కాళేశ్వరం నీళ్లు కేవలం ఒక కేసీఆర్ ఫాంహౌస్కే కాదు, తెలంగాణ నలుమూలలా పారుతున్నయి. పనిచేసే తెలివి ఉంటే పని చేయాలె. చేతగాకపోతే దిగిపోవాలె. అంతేకానీ పసలేని నిందలు వేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడం ఏందో ఏమో!
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

