వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి
అత్యంత హోరాహోరీగా సాగిన భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు అనూహ్య ముగింపు. ఫోర్లు, సిక్సర్ల మోత, పరుగుల వరదతో అభిమానులను అలరించిన సిరీస్ ఆఖరాట వాన ఖాతాలోకి వెళ్లింది.
- 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
బెంగళూరు: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన ఐదో, చివరి టీ20లో వర్షం కారణంగా ఫలితం తేలలేదు. ఫలితంగా ఇరు జట్లూ 2-2తో సిరీస్‌ను పంచుకున్నాయి. వర్షం, ఆపై మైదానం తడిగా ఉండటంతో అంపైర్లు 9 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను ప్రారంభించారు. కానీ, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 7.4 ఓవర్లలో 118/5 స్కోరుతో జోరు మీద ఉన్న సమయంలో మళ్లీ వాన రావడంతో ఆట రద్దయింది. అప్పటికి ఇషాన్ కిషన్ (10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30), నమన్ ధీర్ (6 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 24 నాటౌట్) ధనాధన్ షాట్లతో అలరించి సిరీస్ విజయంపై రేపిన ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. విండీస్ సారథి హోప్‌కు ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు లభించింది.
చినుకులు.. మెరుపులు.. నిట్టూర్పులు..
చిన్నస్వామి స్టేడియం రెండేండ్ల తర్వాత ఆతిథ్యం ఇచ్చిన పోరు వర్షంకారణంగారెండు గంటలు ఆలస్యంగా (కుదించిన ఓవర్లతో) మొదలవగా.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆదినుంచి దూకుడు మంత్రం జపించింది. ఇన్నింగ్స్ నాలుగో బంతిని భారీ సిక్స్‌గా మలిచిన ఓపెనర్ అభిషేక్ (6) వెంటనే ఔటైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇషాన్ ఉన్నది తక్కువసేపేఅయినా.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. రొమారియో వేసిన రెండో ఓవర్లో ఖతర్నాక్ షాట్లతో 6, 4, 6 4 బాది 24 రన్స్ రాబట్టాడు. షమార్ బౌలింగ్‌లో మరో షాట్ కొట్టిన పావెల్‌కు క్యాచ్ ఇచ్చినా శాంసన్ (16) వరుసగా 4,6 బాదడంతో మూడో ఓవర్లోనే స్కోరు 50 దాటింది.
ఐదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన పేసర్ స్ప్రింగర్ తన తొలి బంతికే శాంసన్‌ను బౌల్డ్ చేయగా.. వరుసగా రెండో ఫోర్లతో జోరు మీద కనిపించిన కెప్టెన్ అయ్యర్ (22)ను షమార్ వెనక్కుపంపాడు. అయినా భారత జోరు తగ్గలేదు. ఆపై బాదే బాధ్యతను నమన్ ధీర్ తీసుకున్నాడు. పాల్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతులకు 6,4,6 కొట్టడంతో 6.4 ఓవర్లకే స్కోరు వంద దాటింది. ఆపై, స్ప్రింగర్ బౌలింగ్‌లో మరో సిక్స్ కొట్టాడు. తిలక్ (7)ను స్ప్రింగర్ బౌల్డ్ చేసిన తర్వాత మళ్లీ చినుకులు మొదలవడంతో రాత్రి 10.18 గంటలకు అంపైర్లు ఆట రద్దయినట్టు ప్రకటించడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు నిరాశగా వెనుదిరిగారు.

భువీ 106 మ్యాచ్‌ల తర్వాత..
నాలుగేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెటరన్ పేసర్ భువనేశ్వర్ భారత జట్టులోకి తిరిగొచ్చినా.. తను బౌలింగ్ చేయకుండానే మ్యాచ్ ముగిసింది. అయితే, భారత టీ20 జట్టులో మ్యాచ్‌ల పరంగా సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేసిన ఆటగాడిగా అతను రికార్డుకెక్కాడు. భువీ 2022 నవంబర్‌లో తన చివరి టీ20లో పాల్గొన్నాడు. అప్పటి నుంచి శనివారం వరకు భారత్ ఈ ఫార్మాట్లో ఆడిన 106 మ్యాచ్‌లను అతను మిస్సయ్యాడు. ఖలీల్ అహ్మద్ నవంబర్ 2019-జులై 2024 మధ్య 104 మ్యాచ్‌లకు దూరంగా ఉండి ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

