పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన నిరసనల సందర్భంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్ నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలను లైంగికంగా వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ‘మీరు మమ్మల్ని భయపెట్టగలరేమో కానీ.. మమ్మల్ని మౌనంగా ఉంచలేరు’ అని నినదిస్తూ ప్ల కార్డులు, బ్యానర్లు చేత ధరించిన మహిళలు గురుద్వారా బంగ్లా సాహిబ్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ జరిపారు.
- వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 17: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన నిరసనల సందర్భంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్ నిరసనకారుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. నిరసనల్లో పాల్గొన్న మహిళలను లైంగికంగా వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ‘మీరు మమ్మల్ని భయపెట్టగలరేమో కానీ.. మమ్మల్ని మౌనంగా ఉంచలేరు’ అని నినదిస్తూ ప్ల కార్డులు, బ్యానర్లు చేత ధరించిన మహిళలు గురుద్వారా బంగ్లా సాహిబ్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ జరిపారు.
ఆందోళన సందర్భంగా పోలీసులు అణచివేత, దౌర్జన్యాలకు పాల్పడ్డారని, లింగవివక్షను ప్రదర్శించారని వారు ఆరోపించారు. నిర్బంధంలోకి తీసుకున్న మహిళలపై పోలీస్ బస్సుల్లో, నిర్బంధ కేంద్రాల్లో కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నారు. ఆందోళనకారుల పట్ల కుల, మత వివక్షతో కూడా వ్యవహరించారన్నారు. పోలీసుల దాష్టీకాలపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా వారు తీసుకోలేదని మహిళా సంఘాల నేతలు ఆరోపించారు. ఇవన్నీ మహిళల గళాన్ని అణచివేయడానికి జరిగే స్త్రీద్వేషపూరిత చర్యలేనని వారు మండిపడ్డారు. ఈ ఆందోళనలో ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఏఐపీడబ్ల్యూ, ఏఐఎంఎస్ఎస్, ఏఎల్ఐఎఫ్ఏ, ఏఐసీసీడబ్ల్యూడబ్ల్యూ, ప్రగతిశీల మహిళా సంఘటన్, పురోగమి మహిళా సంఘటన్ తదితర మహిళా సంస్థలు పాల్గొన్నాయి.
దీప్కేకు షరతులతో కూడిన బెయిల్
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు శనివారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసి శాంతి ఒప్పందంపై సంతకం చేయమని కోరినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో సీజేపీ నిర్వహిస్తున్న ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతుండగా శుక్రవారం తన నివాసం వద్ద దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 10న తాను సమర్పించిన శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై దీప్కేను శనివారం ఉదయం అరెస్టు చేశారు.
మరో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దీప్కేను విడుదల చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీప్కేను శనివారం స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(ఎస్ఈఎం) కోర్టు ముందు హాజరుపరిచారు. ఇలాఉండగా లెహ్రా దో తిరంగా నిరసన ప్రదర్శనకు ముందు శుక్రవారం అదుపులోకి తీసుకున్న ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

