హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): వధువుల హక్కులు, ప్ర యోజనాలను పరిరక్షించడంతోపాటు అర్హులైన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయా దేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం స్టే వెకేట్ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ హాజరై వాదనలు వినిపించనున్నట్టు వెల్లడించారు. పథకాలు కొనసాగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.