అమరావతి : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( MLA Balakrishna ) విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామాతను ( Durgamata ) దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి చేరుకున్న బాలకృష్ణను ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.
బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దర్శన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారని అన్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షను భక్తులు తీసుకుంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని శాఖాల అధికారులు సమన్వయంతో పనిచేశారని పేర్కొన్నారు.