ముంబై: నో బాల్ ఇవ్వలేదని మ్యాచ్‌ను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం? పిచ్ నుంచి బ్యాటర్లను వెనక్కి రావాలని పంత్ పిలవడం కరక్టేనా? ఉత్కంఠభరిత మ్యాచ్‌లో పంత్ వ్యవహరించిన తీరు క్రీడా స్పూర్తికి విరుద్ధమే. అంపైర్ల నిర్ణయాన్ని ధిక్కరించడం అది ఐపీఎల్‌కే మచ్చ తెచ్చే ఘటనే. రాజస్థాన్ రాయల్స్‌తో శుక్రవారం జరిగిన భారీ స్కోర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 15 రన్స్ తేడాతో ఓడింది. కానీ చివరి ఓవర్లో మూడవ బంతి తర్వాత స్టేడియంలో భారీ సీన్ జరిగింది.
ఫైనల్ ఓవర్లో డీసీ 36 రన్స్ చేయాలి. పేసర్ మెకాయ్ వేసిన తొలి మూడు బంతుల్లో సిక్సర్లుగా మలిచాడు పావెల్. అయితే మూడో బంతి నడుమ కన్నా ఎక్కువ ఎత్తులో ఫుల్‌టాస్‌గా వచ్చింది. ఆ బంతిని పావెల్ సిక్సర్ బాదాడు. కానీ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించాలని.. ప్లేయర్స్ డగౌట్లో ఉన్న డీసీ కెప్టెన్ పంత్ సంకేతాలు ఇచ్చాడు. ఫీల్డ్ అంపైర్లు ఆ ఫుల్‌టాస్ బాల్‌ను నోబాల్‌గా ప్రకటించకపోవడంతో పంత్ ఆగ్రహానికి గురయ్యాడు. వెనక్కి రావాలంటూ బ్యాటర్లను పిలుస్తూ సంకేతాలిచ్చాడు. చాలా ఆవేశపూరితంగా వ్యవహరించాడు.
#RishabhPant 😯🤯🔥
Whole incident on umpiring…..#DCvsRR #DCvRR #RRvsDC #RRvDC #IPL2022 #IPL #umpire #noball #Shardulthakur #SanjuSamson #umpiring #Cheater @RishabhPant17 @IamSanjuSamson #DelhiCapitals #shanewatson #rovmanpowell @tanay_chawda1 @Cricketracker #JosButler pic.twitter.com/NRYdlMxrZk
— Anmol Narang (@Anmol_Narang_) April 22, 2022
డగౌట్లో ఉన్న మిగితా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ పంత్‌కు వంతపాడారు. కానీ అంపైర్లు నితిన్ మీనన్, నిఖిల్ పట్వర్ధన్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించేందుకు నిరాకరించారు. అంతేకాదు మైదానంలో ఉన్న పావెల్ క్రీజ్‌ను వదలలేదు. మరో వైపు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే.. అంపైర్లకు ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. గ్రౌండ్లో ఫీల్డింగ్ చేస్తున్న జోస్ బట్లర్ కూడా డగౌట్ వద్దకు వచ్చి రిపబ్ పంత్‌తో మాట్లాడారు. చివరకు షేన్ వాట్సన్ రంగంలోకి దిగిన పంత్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత జరిగిన మూడు బంతుల్లో డీసీ రెండు రన్స్ చేసింది.
పంత్ వైఖరి క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ఉన్నట్లు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఆరోపించారు. క్రికెట్ జెంటిల్మెన్ ఆట అని, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ ప్రవర్తన అనుచితంగా ఉన్నట్లు అజర్ తన ట్వీట్లో విమర్శించారు. మరి ఐపీఎల్ నిర్వాహకులు అతనికి ఎలాంటి జరిమానా విధిస్తారో చూడాలి.
Bad sportsman spirit on display by #DelhiCapitals
Cricket is a game of gentlemen and this behaviour is completely unacceptable. #IPL20222 #DCvsRR— Mohammed Azharuddin (@azharflicks) April 22, 2022