బెంగళూరు: కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని బెంగళూరులోని అధ్వాన రోడ్లు మరోసారి వార్తలకెక్కాయి. గుంతలతో నిండిన రోడ్ల కారణంగా తాను ఎలా భారీ ప్రమాదానికి గురయ్యింది, కాళ్లు, చేతులు ఎలా విరిగింది దవాఖాన బెడ్ మీద నుంచే బెంగళూరు వాసి ఒకరు విడుదల చేసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోను ఇన్స్టాలో పంచుకున్న బాధితుడి స్నేహితురాలు ఖ్యాతిశ్రీ మార్కింగ్ చేయని స్పీడ్ బ్రేకర్లు, అడుగు లోతున్న గోతుల గురించి ప్రస్తావించింది.
బాధితుడు సౌరభ్ పాండే వీడియోలో మాట్లాడుతూ ‘బెంగళూరులోని ఏ రోడ్డయినా పూర్తిగా గుంతలతో నిండి ఉంది. ప్రమాదంలో నా కాలు, చేయి, తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది నిజంగా విషాదం. దయ చేసి నగర రోడ్ల గురించి ఏదన్నా చేయండి. ఇది చాలా ముఖ్యం’ అని ఆయన అన్నారు.