న్యూఢిల్లీ, నవంబర్ 27 : గత నాలుగు రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ భారీగా పడిపోవడం, దేశీయంగా స్టాకిస్టులు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు నిలిచిపోవడంతో దేశీయంగా ధరలు దిగొచ్చాయి. నూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.640 తగ్గి రూ.1,29,460కి దిగొచ్చింది.
బంగారం తగ్గుముఖం పట్టినప్పటికీ, వెండి భారీగా పుంజుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.5,100 ఎగబాకి రూ.1,68,200 పలికింది. గత మూడు రోజుల్లో వెండి రూ.13,200 పెరిగినట్టు అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 5.60 డాలర్లు తగ్గి 4,158.38 డాలర్లకు పడిపోగా, వెండి 53.39 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.