ఇస్లామాబాద్: విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కోహ్లీ వరుసగా బ్యాటింగ్‌లో విఫలం అవుతున్నాడు. పెద్దగా స్కోర్ చేయలేకపోతున్నాడు. దీంతో అతని ఆటతీరుపై అందరిలో టెన్షన్ మొదలైంది. హేమాహేమీలు కూడా తమకు తోచిన సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయితే విరాట్‌కు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అండగా నిలిచాడు. ఒకప్పుడు కోహ్లీనే ఇన్స్పిరేషన్గా తీసుకుని మేటి క్రికెటర్‌గా మారిన బాబర్ ఆజమ్ ఇప్పుడు పాకిస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
అంతేకాదు గత రెండేళ్ల నుంచి టాప్ ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీ సాధించిన ఎన్నో రికార్డులను అతను అధిగమిస్తూనే ఉన్నాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగన రెండో వన్డేలో కోహ్లీ 16 రన్స్‌కే ఔటయ్యాడు. కోహ్లీ స్వల్ప స్కోరుకే ఔటైన వెంటనే బాబర్ ఆజమ్ ఓ ట్వీట్ చేశాడు. స్టే స్ట్రాంగ్ అంటూ కోహ్లీకి అండగా వెన్నుతట్టే రీతిలో ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజమ్ దూసుకెళ్తున్నాడు. టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అతనే టాప్‌లో ఉన్నాడు. కోహ్లీ పేరిట ఉన్న నెంబర్ వన్ బ్యాటింగ్ రికార్డును బాబర్ అధిగమించాడు.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022