ఇస్లామాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. టాప్ ఫామ్‌లో ఉన్న ఆ ఓపెనింగ్ బ్యాటర్ తాజాగా టీ20 ర్యాంకుల్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టేశాడు. అంతేకాదు కోహ్లీ పేరిట ఉన్న రికార్డును అతను తుడిపేశాడు. కోహ్లీ గతంలో 1013 రోజుల పాటు టీ20ల్లో ఫస్ట్ ర్యాంక్‌లో కొనసాగాడు. అయితే ఆ రికార్డును ఇప్పుడు బాబర్ ఆజమ్ దాటేశాడు. టీ20లతో పాటు వన్డేల్లోనూ బాబర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాక్ జట్టు ఆటగాడు మహమ్మద్ రిజ్వాన్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక టాప్ 10 జాబితాలో ఇండియన్ ప్లేయర్ ఇషాన్ కిషన్ ఒక్కడే ఉన్నాడు. అతను ఏడవ ర్యాంక్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఇషాన్ రాణించిన విషయం తెలిసిందే.
Another record for Babar Azam 👊
All the changes in this week's @MRFWorldwide men's rankings 👇
— ICC (@ICC) June 29, 2022