Ayush Shetty : చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) చెలరేగుతున్నాడు. సీనియర్లు చేతులెత్తేసిన చోట తన దూకుడైన ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆయుశ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో అదుర్స్ అనిపిస్తున్న భారత కుర్రాడు క్వార్టర్స్‌లో మూడో సీడ్ సీడ్ జోనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా)ను ఓడించాడు. అద్భుత విజయంతో సెమీస్ చేరిన ఆయుశ్ పతకంపై ఆశలు రేపుతున్నాడు.
బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్ పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే ఏడో ర్యాంకర్ చైనా ఆటగాడిని ఇంటికి పంపిన ఆయుశ్ అదే ఊపులో 25వ ర్యాంకరైన చీ యూ జెన్(చైనీస్ తైపీ)ను వణికించాడు. క్వార్టర్స్‌లోనూ జోరు చూపించిన భారత షట్లర్ జొనాథన్ క్రిస్టీకి చెక్ పెట్టాడు.
Semi-Final Bound! 💥
Ayush Shetty stuns the world by knocking out the 4th seed Jonatan Christie to seal his spot in the Semi-Finals. The grit, the passion, and the giant-killing spree continues! 🚀 pic.twitter.com/fB6GsjdW4d
— BAI Media (@BAI_Media) April 10, 2026
హోరాహోరీగా జరిగిన తొలి సెట్‌ను 23-21తో గెలుచుకున్న ఆయుశ్ రెండో సెట్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. 21-17తో మ్యాచ్ ముగించి సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. తద్వారా ఈ మెగా టోర్నీలో భారత పతక ఆశలను సజీవంగా ఉంచాడీ యంగ్‌స్టర్. సీనియర్లు హెచ్‌హెస్ ప్రణయ్, పీవీ సింధులు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.