కారేపల్లి, ఏప్రిల్ 10 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ సబ్ సెంటర్)కు బాజుమల్లాయిగూడెంనకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పోతుల శ్రీధర్ తన తాత నారాయణ జ్ఞాపకార్థం ఎలక్ట్రిక్ వాటర్ డిస్పెన్సర్ వితరణగా ఇచ్చారు. సీఐ శ్రీధర్ తండ్రి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా సబ్ సెంటర్ సిబ్బందికి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సిఐ స్పందిస్తూ.. తాను పుట్టి పెరిగిన స్వగ్రామానికి సామాజిక సేవలో భాగంగా వైద్య సిబ్బంది సూచన మేరకు డిస్పెన్సర్ వితరణగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ బంధం జ్యోతిలక్ష్మి, ఎంఎల్హెచ్పీ కళ్యాణి, ఏఎన్ఎం ఉష, గ్రామస్తులు దుబ్బాక్కుల శేఖర్, పోతుల నాగేశ్వరావు పాల్గొన్నారు.