నూతనకల్, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ తన మాతృమూర్తి అనంతుల భిక్షమమ్మ జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం భోజన ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని సోమన్న, అనంతుల మధు, జాల మహేష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.