Ayush Shetty | మూడో సీడ్‌పై ఆయుశ్ అదిరే విజయం.. భారత పతక ఆశలు సజీవం..!
Ayush Shetty : చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) చెలరేగుతున్నాడు. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆయుశ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.
Ayush Shetty : చైనా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి (Ayush Shetty) చెలరేగుతున్నాడు. సీనియర్లు చేతులెత్తేసిన చోట తన దూకుడైన ఆటతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న ఆయుశ్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో అదుర్స్ అనిపిస్తున్న భారత కుర్రాడు క్వార్టర్స్‌లో మూడో సీడ్ సీడ్ జోనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా)ను ఓడించాడు. అద్భుత విజయంతో సెమీస్ చేరిన ఆయుశ్ పతకంపై ఆశలు రేపుతున్నాడు.
బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్ పురుషుల సింగిల్స్‌లో ఆయుశ్ శెట్టి జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే ఏడో ర్యాంకర్ చైనా ఆటగాడిని ఇంటికి పంపిన ఆయుశ్ అదే ఊపులో 25వ ర్యాంకరైన చీ యూ జెన్(చైనీస్ తైపీ)ను వణికించాడు. క్వార్టర్స్‌లోనూ జోరు చూపించిన భారత షట్లర్ జొనాథన్ క్రిస్టీకి చెక్ పెట్టాడు.
Semi-Final Bound! 💥
Ayush Shetty stuns the world by knocking out the 4th seed Jonatan Christie to seal his spot in the Semi-Finals. The grit, the passion, and the giant-killing spree continues! 🚀 pic.twitter.com/fB6GsjdW4d
— BAI Media (@BAI_Media) April 10, 2026
హోరాహోరీగా జరిగిన తొలి సెట్‌ను 23-21తో గెలుచుకున్న ఆయుశ్ రెండో సెట్లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. 21-17తో మ్యాచ్ ముగించి సెమీస్ పోరుకు సిద్ధమయ్యాడు. తద్వారా ఈ మెగా టోర్నీలో భారత పతక ఆశలను సజీవంగా ఉంచాడీ యంగ్‌స్టర్. సీనియర్లు హెచ్‌హెస్ ప్రణయ్, పీవీ సింధులు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

