ఆయుర్వేదం ప్రకారం మాడు దురదకు… మనం తినే ఆహారానికి సంబంధం ఉంటుంది. తినకూడని పదార్థాలు శరీరంలో వాత, పిత్త, కఫాల సమతూకాన్ని దెబ్బతీస్తాయి. దీంతో మాడు దురదగా అనిపిస్తుంది. ఇదేకాకుండా చుండ్రు వల్ల, షాంపూ, తలనూనెలు, పేల కారణంగా కూడా మాడు దురద పుడుతుంది. తలలో ఇన్ఫెక్షన్ కూడా ఈ సమస్యకు దారితీస్తుంది. సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, పొక్కులు, అటాపిక్ డెర్మటైటిస్ అనే చర్మ సమస్య మొదలైన వాటి వల్ల కూడా మాడుపై విపరీతమైన దురదగా అనిపిస్తుంది. ఈ సమస్య లక్షణాలు, దీన్నుంచి విముక్తి పొందడానికి ఆయుర్వేద వైద్యులు కొన్ని పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు.