న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రతి ఏడాది శ్రీరామ నవమి రోజున సూర్య కిరణాలు రాముడి విగ్రహంపై పడి పరావర్తనం చెంది గర్భగుడిని ప్రకాశింపజేసేలా అయోధ్య రామాలయ నిర్మాణం ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఒడిశాలోని కోణార్క్‌లో 13వ శతాబ్దంలో నిర్మించిన సూర్య దేవాలయమే దీనికి స్ఫూర్తి అని చెప్పారు. సాంకేతిక అంశాలపై పలు ఐఐటీలతో కలిసి పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. నవంబర్ 15 నుంచి ఆలయ పిల్లర్ల నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు.