హైదరాబాద్, మార్చి 11 ( నమస్తే తెలంగాణ ) : పాఠశాల విద్యాశాఖలో ఎఫ్ఎల్ఎన్ ఏఐ(ఏఎక్స్ఎల్)ను రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 41 ప్రాథమిక పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలుచేస్తున్నారు. ఈ నెల 15 నుంచి మరో 27 జిల్లాల్లోని 383 పాఠశాలలకు విస్తరించనున్నారు. జిల్లాకు నలుగురు చొప్పున నిపుణులకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ ఇచ్చారు.
హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ ( డెహ్రాడూన్ ) ప్రవేశ పరీక్షను జూన్ 1న నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి 31లోపు ఎస్ఈఆర్టీ కార్యాలయానికి దరఖాస్తులు పంపాలని సూచించారు. సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌ను ఏర్పాటుచేశామని, వివరాలకు 85208 66771 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.