హనుమకొండ చౌరస్తా : ప్రపంచ నీటి దినోత్సవం ( Water Conservation ) సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా యూత్ ఫర్ సొసైటీ ( Youth for Society ) ఆధ్వర్యంలో ఆదివారం పొదుపుపై వేయిస్తంభాల గుడి వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా యూత్ ఫర్ సొసైటీ తెలంగాణ అధ్యక్షులు కోడిమాల శ్రీనివాసరావు, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ రతన్‌సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరం నీరు, లింగ సమానత్వం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించే కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.
నీరు ప్రవహించే చోట సమానత్వము పెరుగుతుందని, నీరు అందరికీ సమానంగా అందితే సమాజంలో సమానత్వం, ఐక్యత పెరుగుతాయన్నారు. మనకు లభిస్తున్న నీటిలో మూడు శాతం మాత్రమే అందులో 0.3 నీరు మాత్రమే త్రాగేందుకు అనుకూలమైనదని వివరించారు.
ఉన్న నీటిని పొదుపుగా వాడి భవిష్యత్ తరాల కోసం పొదుపు చేయాలని, ప్రతి వర్షపు బొట్టును సంరక్షించాలని, వృధాను అరికట్టాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూత్ ఫర్ సొసైటీ బాధ్యులు దేవిశ్రీప్రసాద్, నీరజ్, రుత్విక్, విష్ణు, రోహిత్,అర్జున్ కార్తికేయ, రాజు పాల్గొన్నారు.