హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో ఆటోమెటెడ్ డ్రిప్ సిస్టంను ప్రయోగాత్మకంగా పరిశీలించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన పరికరాల ను వ్యవసాయ యాంత్రీకరణలో భా గం చేయాలని సూచించారు. గురువా రం సచివాలయంలో టీజీ ఆయిల్‌ఫెడ్, మార్ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కొన్ని జిల్లా ల్లో ఆయిల్ పామ్‌సాగు విస్తీర్ణం ఆశించిన స్థాయిలో లేదని, వెంటనే అకడ ఉన్నటువంటి ఆయిల్‌పామ్ కంపెనీల జోన్లను రద్దు చేసి, ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.