హసన్‌పర్తి, జనవరి 22 : హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఎస్సార్ యూనివర్సిటీకి అరుదై న గుర్తింపు లభించింది. తమ వర్సిటీ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ బై సబ్జెక్ట్ 2026లో విశేష ఘనత సాధించినట్టు చాన్స్‌లర్ వరదారెడ్డి గురువా రం తెలిపారు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో గ్లోబల్ ర్యాంక్ 601-800, జాతీయ ర్యాంక్ 21, ఇంజినీరింగ్ విభాగం లో గ్లోబల్ ర్యాంక్ 601-800, జ్యాతీయ ర్యాంక్ 18 సాధించిందని చెప్పారు.
ఈ ర్యాంక్‌ను ఈ నెల 21న విడుదల చేసిందని తెలిపారు. ఇంతకుముం దు ఎస్సార్‌యూ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2026 గ్లోబల్ ర్యాంకింగ్ 801-1000, జాతీయ ర్యాంక్ 28 పొంది దేశంలో గ్లోబల్ ర్యాంక్ సాధించిన ఎస్సార్ యూనివర్సిటీ ఒకటని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్, కోర్ ఇంజినీరింగ్ రంగాల్లో జరుగుతున్న ప్రభావవంతమైన పరిశోధనల ఫలితంగానే ఈ ర్యాంకు సాధించినట్టు తెలిపారు. చాన్స్‌లర్ వరదారెడ్డిని వైస్‌చాన్స్‌లర్ దీపక్‌గార్గ్, రిజిస్ట్రార్ రమణారావు, రాజశేఖర్, వివిధ విభాగాధిపతులు అభినందించారు.