కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 29 : అత్యాధునిక ఫీచర్స్ గల ప్రముఖ కార్లు, ద్విచక్ర వాహనాల కోసం చూస్తున్నారా? వాటి వివరాలు తెలుసుకోవడానికి కరీంనగర్లో షోరూం లేదని అసంతృప్తి చెందుతున్నారా? అలాంటి వారి కోసం నగరంలో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ గొప్ప అవకాశం కల్పిస్తున్నాయి. హైరేంజ్ కార్లు కొనాలనుకునే వారికి ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీల్లో కరీంనగర్లోని జ్యోతిబాఫూలే మైదానం (సర్కస్ గ్రౌండ్)లో ఆటో షో నిర్వహిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, ద్విచక్ర వాహనాలు రెండు రోజులపాటు ప్రదర్శన కోసం ఈ షోకు వస్తున్నాయి. ఇన్నాళ్లూ మెట్రో పాలిటన్ సిటీలకే పరిమితమైన అత్యాధునిక కార్లు ఇప్పుడు కరీంనగర్లోనూ దర్శనమిస్తున్నాయి. ఒకే వేదికపై సరికొత్త మోడళ్లను ప్రదర్శించనున్నాయి. సుమారు 20కిపైగా కార్ల కంపెనీలతోపాటు ద్విచక్ర వాహన కంపెనీలు ఆటో షోలో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీలు, మోటర్ బైక్, ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు ఒకే వేదికపై తమ ఉత్పత్తులను ఏర్పాటు చేయనుండగా, కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారనున్నది.