గోల్నాక : బాగ్అంబర్పేటకు చెందిన ఐఎఫ్టీయూ ఆటో యూనియన్ నాయకులు శుక్రవారం గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో టీఆర్ఎస్కేవీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ వారికి గుర్తుంపు కార్డులతో పాటు రూ.5లక్షల ప్రమాదబీమా పత్రాలు అందజేసి వారికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు నిరంజన్, ఎస్కే చారి, అంజన్న, వెంకటేశ్, రాజేశ్వరరావు, నరసింహ, హైమత్, రవి, హనుమంతు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.