పెద్ద శంకరంపేట : వ్యక్తి దారుణ హత్కు గురైన సంఘటన పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన తోట సుధాకర్ (45) ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంటి ఆరుబయట నిద్రించగా గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తోట సుధాకర్ పై దాడి చేయడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయమే సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ అల్లాదుర్గం సీఐ రేణుక పెద్ద శంకరంపేట, అల్లాదుర్గం ఎస్సైలు ప్రవీణ్ రెడ్డి, శంకర్ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసు జాగిలాలు, క్లూస్ టీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య ఇటీవలే మరణించగా ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.