టిప్పర్ను ఢీకొట్టిన ఆటో.. ముగ్గురు దుర్మరణం
రోడ్డు ప్రమాదం | కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.

అమరావతి : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామశివారులో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. జింజేరు గ్రామానికి చెందిన 12 మంది కూలీ పనుల నిమిత్తం వడ్లమన్నాడు గ్రామానికి ఆటోలో బయల్దేరారు.
గ్రామశివారులో డ్రైవర్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ టీ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

