VEERNAPALLY| వీర్నపల్లి, మార్చి 28 : విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో కనెక్షన్ తొలగించిన సెస్ అధికారుల తీరుపై గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని అడవి పదిర గ్రామంలో గతంలో ఓ అధికారి తప్పిదంతో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని, ఆ సమస్యను పరిష్కారిస్తామని అధికారులు హామీ ఇచ్చి మరిచారని వాపోయారు. సమస్య పరిష్కారించకుండా ఇప్పుడు కరెంటు కనెక్షన్ తొలగించడం పట్ల సెస్ ఏఈ రమేశ్ పై అగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల అందోళనతో దిగివచ్చిన అధికారులు గ్రామంలో తొలగించిన విద్యుత్ కనెక్షన్ లను పునరుద్ధరించారు.