Australian PM : ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ (Sydney) నగరంలోగల బాండీ బీచ్ (Bondi beach) లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ దేశ ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (Anthony Albanies) అన్నారు. ఈ దృశ్యాలు అత్యంత షాకింగ్‌గా, కలవరపరిచేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం బాండీ బీచ్‌లో ఇద్దరు దుండుగులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు.
బాండీ బీచ్‌లో చోటుచేసుకున్న ఘటన దృశ్యాలు కలచివేస్తున్నాయని ఆస్ట్రేలియా ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు అల్బనీస్ ట్వీట్ చేశారు. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. యూదుల ప్రార్థనా సమావేశం సమీపంలో ఈ దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడగా, వారిలో ఒకరిని పోలీసులు మట్టుబెట్టారు. తీవ్రంగా గాయపడిన మరో షూటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.