సిడ్నీ: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో కీలక ఆటగాళ్లు (పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్) సిరీస్‌కు అందుబాటులో లేకున్నా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆ జట్టు.. సిడ్నీలో ముగిసిన ఐదో టెస్టులోనూ జయభేరి మోగించి ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 342 పరుగులకు కట్టడి చేసిన ఆసీస్.. ప్రత్యర్థి నిర్దేశించిన 160 పరుగుల ఛేదనను 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
లబూషేన్ (37), వెదరాల్డ్ (34) రాణించారు. సిరీస్ ఆసాంతం రాణించి 31 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్స్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియా మరింత పటిష్టం చేసుకుంది. ఈ సైకిల్లో 8 టెస్టులాడిన ఆసీస్.. ఏకంగా ఏడు గెలిచి 87.5 శాతంతో మొదటి స్థానంలో ఉంది. పదింట్లో మూడు మాత్రమే గెలిచిన ఇంగ్లండ్.. 7వ స్థానంతో ఫైనల్ చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.