ఆసీస్ చేతిలో 6 వికెట్లతో ఓటమి
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో మూడో పరాజయం మూటగట్టుకున్న భారత జట్టు.. నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. శనివారం జరిగిన కీలక పోరులో మిథాలీ బృందం 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఇక మెగాటోర్నీలో సెమీఫైనల్‌కు చేరాలంటే.. లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక నెగ్గాల్సిందే. మరోవైపు లీగ్‌లో అజేయంగా ఐదో విజయం ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా.. అందరికంటే ముందు సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. మిథాలీరాజ్ (68), యస్తిక భాటియా (59), హర్మన్‌ప్రీత్ కౌర్ (57 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. లక్ష్యఛేదనలో ఆసీస్ 49.3 ఓవర్లలో 4 వికెట్లకు 280 రన్స్ చేసింది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మెగ్ లానింగ్ (97), అలీసా హీలీ (72) దంచికొట్టారు.