నాగర్ కర్నూల్ : మద్యం మత్తులో యువకుడి కిడ్నాప్‌కు పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వలో చోటు చేసుకుంది. కొంతమంది యువకులు మద్యం మత్తులో సెంట్రింగ్ పని చేస్తున్న రాజు అనే ఒక యువకుడ్ని కిడ్నాప్ చేయడానికి యత్నించిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక కారులో ఆరు మంది యువకులు వచ్చి గ్రామంలో కొద్దిసేపు హల్ చల్ చేశారు. ఓ పాత పంచాయితీ విషయంలో యువకుడిని కిడ్నాప్ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు.
దీంతో స్థానిక గ్రామస్తులు వారిని అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసుల రాకను గ్రహించి ఆ యువకులు అక్కడినుండి పారిపోయి నట్లు తెలిపారు. ఈ ఘటనపై రాజు అనే యువకుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ శంషాద్దీన్ తెలిపారు.