పాక్‌కు 1500 మంది సిక్కు యాత్రికులు
At least 1,500 Indian pilgrims to visit Pakistan for Gurupurab from November 17 to 26: MEA | గురునానక్ గురుపరబ్ (జయంతి) సందర్భంగా దాదాపు 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులు పాక్‌ను సందర్శించనున్నారు. భారత్-పాక్

న్యూఢిల్లీ : గురునానక్ గురుపరబ్ (జయంతి) సందర్భంగా దాదాపు 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులు పాక్‌ను సందర్శించనున్నారు. భారత్-పాక్ మధ్య 1974 ద్వైపాక్షిక ప్రోటోకాల్స్ మేరకు నవంబర్ 17-26 మధ్య యాత్రికులు అత్తారి – వాఘా ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ ద్వారా పాక్‌లో ఉన్న గురుద్వారాను సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది.
1974 పోట్రోకాల్ ప్రకారం యాత్రలో పాల్గొనే యాత్రికుల జాబితా సిద్ధమైందని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. పర్యటనలో సిక్కు యాత్రికులు గురుద్వారా దర్బార్ సాహిబ్, పంజా సాహిబ్, డేరా సాహిబ్, కర్తార్‌పూర్ సాహిబ్, గురుద్వారా సచ్చా సౌధాలను సందర్శిస్తారని పేర్కొన్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున గురునానక్ జయంతి జరుగనునున్నది.
కొవిడ్ మహమ్మారి కారణంగా మార్చి 2020లో కర్తార్‌పూర్ కారిడార్‌ను నిలిపివేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో, జూన్‌లోను రెండుసార్లు భారత్ నుంచి పాక్‌కు సిక్కు యాత్రికులకు అనుమతి నిరాకరించింది. ఈ సందర్భంగా ఆయన వ్యాక్సిన్ల సరఫరాపై మాట్లాడుతూ.. భారత్ వ్యాక్సిన్ మైత్రిలో భాగంగా విదేశాలకు వ్యాక్సిన్ల ఎగుమతి ప్రారంభించిందన్నారు. దేశీయంగా అవసరాలను దృష్టిలో ఉంచుకొని.. విదేశాలకు ఎగుమతి ప్రారంభించినట్లు చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

