అచ్చంపేట రూరల్ : మండలంలోని పెద్ద తండా గ్రామ పంచాయతీలో ఆశా వర్కర్ (Asha worker ) కాట్రవత్ దేవి (48) రోడ్డు ప్రమాదంలో ( Road Accident ) మరణించారు. సొంత పనిపై పక్కనే ఉండే బొమ్మనపల్లి గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పెద్దమ్మ గుడి సమీపంలో ద్విచక్ర వాహనంపై నుంచి జారి పడింది. దీంతో ఆమెను అచ్చంపేట సర్కారు దవాఖానకు తరలించగా ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణం పోయిందన్నారు.
మృతురాలి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిద్దపూర్ ఎస్సై పవన్ కుమార్( SI Pavan Kumar ) తెలిపారు. కాట్రవత్ దేవి చందాపూర్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో ఆశా వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు భర్త, పిల్లలు లేరు. తల్లి తో కలిసి పెద్దతండాలో అన్నదమ్ములతో కలిసి ఉంటుంది. మాజీ ఎంపీపీ రామనాథం దవాఖానలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.