ప్రేమికుల రోజు కానుకగా..
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.కిషోర్ తిరుమల దర్శకుడు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ నెల 25నప్రేక్షకులముందుకురానుంది. సోమవారం వాలైంటెన్స్ సందర్భంగా ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ గీతాన్ని విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరచిన ఈ పాట ప్రేమికుల మనోభావాలకు దర్పణంలా ఉంటూ మెలోడీ ప్రధానంగా ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ‘ఇటీవలే విడుదల చేసిన టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఆడవాళ్ల గొప్పతనాన్ని, త్యాగశీలతను ఆవిష్కరిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సకుటుంబ చిత్రంగా అలరిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, రవిశంకర్, సత్య, ప్రదీప్‌రావత్, గోపరాజు, బెనర్జీ, కల్యాణీనటరాజన్, రాజశ్రీనాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్‌సారంగ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: శ్రీకర్‌ప్రసాద్, దర్శకత్వం: తిరుమల కిషోర్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

