Arvind Kejriwal | ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎట్టకేలకు అధికారిక బంగ్లా లభించింది. సీఎం అధికారిక నివాసాన్ని విడిచిపెట్టిన దాదాపు ఏడాది తర్వాత ఆయనకు కేంద్రం అధికారిక బంగ్లాను (official bungalow) కేటాయించింది. 95, లోధి ఎస్టేట్‌లోని టైప్ 7 బంగ్లాను కేటాయించింది. అయితే, బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) గతంలో నివసించిన లోధి ఎస్టేట్ (Lodhi Estate)లోని బంగ్లాను కేజ్రీవాల్‌కు కేటాయించాలని ఆప్ కోరింది. కానీ ఆ బంగ్లాను జూన్‌లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించడంతో.. కేజ్రీకి వేరే బంగ్లా అలాట్ చేశారు.
2024 అక్టోబర్‌లో ఢిల్లీ సీఎం పదవి నుంచి వైదొలిగిన అరవింద్ కేజ్రీవాల్, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని అధికార నివాసాన్ని ఖాళీ చేశారు. నాటి నుంచి మండి హౌస్ సమీపంలోని మరో పార్టీ సభ్యుడి అధికారిక గృహంలో ఆయన నివసిస్తున్నారు.ఈ క్రమంలో తనకు అధికారిక బంగ్లా కేటాయించాలంటూ కేజ్రీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా పది రోజుల్లోగా ప్రభుత్వ నివాసం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేజ్రీకి అధికారిక బంగ్లాను కేటాయించారు.
Also Read..
Bihar Elections | బీహార్‌లో బీజేపీ ఎన్నికల వ్యూహం.. ఫేమస్ సింగర్‌ను బరిలోకి దింపనున్న కమలదళం
Rare Earth Minerals: అరుదైన ఖనిజాలను అమెరికాకు ఎగుమతి చేసిన పాకిస్థాన్
Donald Trump: నా మాటలు ప్రభావం చూపాయి, అందుకే యుద్ధం ఆపారు: డోనాల్డ్ ట్రంప్