Donald Trump: నా మాటలు ప్రభావం చూపాయి, అందుకే యుద్ధం ఆపారు: డోనాల్డ్ ట్రంప్
Donald Trump: వాణిజ్య సుంకాలతో ఇండోపాక్ వార్‌కు బ్రేకేసినట్లు మరోసారి ట్రంప్ చెప్పారు. సోమవారం ఓవల్ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలతో జరిగిన తన సంభాషణలు ప్రభావంతంగా పనిచేసినట్లు ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ: దిగుమతి సుంకాలు విధిస్తామని వాణిజ్య బెదిరింపులకు పాల్పడడం వల్లే ఇండియా, పాకిస్థాన్ మధ్య సంక్షోభం తెరపడినట్లు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. ఆ రెండు దేశాలతో ఇటీవల తాను సాగించిన సంభాషణలు చాలా ప్రభావంతంగా పనిచేసినట్లు ఆయన చెప్పారు. వాణిజ్యం ద్వారా రెండు అణ్వాయుధ దేశాల మధ్య సమరోద్రిక్తతలను తగ్గించినట్లు ఆయన వెల్లడించారు. అమెరికాకు వాణిజ్య సుంకాలు చాలా కీలకమైనవని పేర్కొన్నారు. టారిఫ్‌ల వల్లే తాము పీసీకీపర్లుగా ఉన్నామని చెప్పారు. వాణిజ్యం ద్వారా కేవలం వందల బిలియన్ల డాలర్లు ఆర్జించడమే కాదు, ఆ సుంకాలతోనే పీస్కీపర్ల పాత్ర పోషిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
సోమవారం ఓవల్ ఆఫీసులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత .. పాక్‌లోని ఉగ్ర స్థావరాలను ఆపరేషన్ సింధూర్ ద్వారా ఇండియా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. అయితే మే 10వ తేదీన రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఆ డీల్‌కు తానే ప్రాణం పోసినట్లు ట్రంప్ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

