అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి ( Indira Souragiri ) జల వికాసం పథకం పనులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ( Collector Badawat Santosh ) , జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు, అమరేందర్, దేవ సహాయం కలిసితో కలిసి ఆదివారం పరిశీలించారు
. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్( ROFR ) పట్టా ఉన్న పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు చేయూతనందించడం కోసం ఉద్దేశించిందని పేర్కొన్నారు. బోరు బావి తవ్వించడం ద్వారా నీటి సదుపాయం కల్పించడం, సౌర విద్యుత్ ద్వారా పంపుసెట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించడం, రైతుల భూముల్లో పండ్ల తోటలు పెంచడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు వివరించారు.
ఈనెల 18న ప్రారంభించనున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకానికి సంబంధించిన పనులను సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు తెలిపారు . భూగర్భ జల అధికారులు సూచించిన ప్రాంతాల్లో బోరు బావులు తవ్విస్తున్నామని వెల్లడించారు. వెంటనే సౌర విద్యుత్ ద్వారా బోరుబావులకు పంపు సెట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రైతులకు అవసరమైన పండ్ల తోట మొక్కలను సిద్ధం చేస్తున్నామని వివరించారు.
కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డీవో మాధవి, గ్రౌండ్ వాటర్ ఏడీ దివ్య జ్యోతి, డీటీడీవో ఫిరంగి, డీపీవో మోహన్ రావు , జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు వెంకటేశం, జగన్, ఐటీడీఏ అధికారి జాఫర్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్అండ్ బీ డీఈ జలంధర్,అమ్రాబాద్ తహసీల్దార్ శైలేంద్ర , ఎంపీడీవో , ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.