కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి లాల్‌బజార్ హనుమాన్ దేవాలయం 150 ఏండ్ల చరిత్ర కలిగిన హనుమాన్ దేవాలయాన్ని ఆర్మీ అధికారులు రెండేళ్ల క్రితం మూసివేశారు.కొద్ది రోజుల కిత్రం తిరిగి తెరిచారు.కానీ భక్తులకు మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నారు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలకు భక్తులను ఆంక్షలు విధించి గుడిలోకి అనుమతి స్తున్నారు. కేవలం నలుగురు చొప్పున మాత్రమే ఆలయానికి వెళ్లాలని,అది కూడా ఆర్మీ సెక్యూరిటీ వద్ద తగిన ఆధారాలు చూపించి దేవుడిని దర్శనం చేసుకోవాలని నిబంధన విధించారు.
బొల్లారం, ఏప్రిల్ 8 :
కంటోన్మెంట్ తిరుమలగిరిలో అడుగడుగునా ఆంక్షలే.. లాల్‌బజార్ చిన్న కమేళా బస్తీలో కనీసం బాత్రూంలు కూడా కట్టుకోకూడదు.ఎప్పుడు ఏ రోడ్లు మూసివేస్తారో..ఎటు నుంచి తిరిగి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది.ఏండ్ల్ల తరబడి ప్రజలు వినియోగించే రోడ్లను సైతం ఉన్న పళంగా మూసివేస్తారు.భద్రతా కారణాల పేరుతో దేవాలయాలు,మసీదులు,చర్చిలు, శ్మశానాలు ఇలా పలు చోట్ల మూతపడ్డాయి.దీనిపై వార్డు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గన్‌రాక్ సమీపంలోని హిందూ శ్మశాన వాటికలో శవాల పూడ్చివేతకు ఆర్మీ అధికారులు అడ్డుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు.
150 ఏండ్ల నాటి లాల్‌బజార్ హనుమాన్ ఆలయాన్ని మూసివేసి ఇప్పుడు ఆంక్షలు విధించి నలుగురిని పంపిస్తున్నారు.అది కూడా ఆధారు కార్డు చూపించి లోపలికి పంపిస్తున్నారు. మేము భారతదేశంలో ఉన్నామా, లేక పాకిస్తాన్లో ఉన్నామా సందేహం కలుగుతుంది. హరిజన బస్తీ గుండా దారిచ్చే అవకాశం ఉన్నా,ఆర్మీ అధికారుల మొండిగా వ్యవహరిస్తున్నారు.కేంద్ర రక్షణ శాఖ వర్గాలు చర్యలు తీసుకొని ఆంక్షలు లేకుండా గుడిలోకి ప్రవేశించడానికి అనుమతించాలని కోరుతున్నాం.
-అశోక్,లాల్‌బజార్ హనుమాన్ దేవాలయం కమిటీ సెక్రటరీ