కారేపల్లి, జూలై 14 : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గంలో గల పలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాలుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులను ఎమ్మెల్యే అభినందించి తమ సేవల ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ఠతను మరింత పెంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దుగ్గిరాల జయరాజ్, సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు, సింగరేణి సర్పంచ్ మేదరి టోనీ, బీసీ సెల్ నాయకులు బోళ్ల రమేశ్, కిసాన్ సెల్ నాయకుడు కడియాల సుధాకర్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.