BC Civils Longterm Coaching | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్- 2027 దీర్ఘకాలిక ఉచిత కోచింగ్ కోసం వెనుకబడిన తరగతుల (BC) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ కోసం ‘తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం (TGBCESDTC) మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. ఈ కోచింగ్ ఆగస్టు 24 నుంచి 2027, మే వరకు హైదరాబాద్, లక్ష్మీనగర్ కాలనీలో టీజీ బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించనున్నారు.
ఎంపిక
దీనిలో 150 మంది అభ్యర్థులకు ప్రవేశం కల్పిస్తారు. వీరిలో 100 మంది అభ్యర్థులను ఆన్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఉతీర్ణులైన 50 మంది అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష లేకుండానే నేరుగా ప్రవేశం కల్పిస్తారు.
సౌకర్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 5000 స్టైపెండ్ ఇస్తారు. ఒకసారి పుస్తక నిధి కింద రూ. 5000 చెల్లిస్తారు. గ్రంథాలయం, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీల ద్వారా బోధన ఇప్పిస్తారు.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో రూ. 1.50 లక్షలోపు, పట్టణ ప్రాంతంలో రూ. 2 లక్షలలోపు ఉండాలి. ఉద్యోగం లేకుండా, ఇతర విద్యా కోర్సులు అభ్యసించకుండా ఉండాలి. ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్ పొందకూడదు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులను జూలై 17 నుంచి ఆగస్టు 7 వరకు స్వీకరిస్తారు. హాల్ టికెట్ల డౌన్లోడింగ్ ఆగస్టు 13 నుంచి ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష ఆగస్టు 16న నిర్వహిస్తారు. ఫలితాలు ఆగస్టు 19న విడుదల చేస్తారు. ధ్రువపత్రాలను ఆగస్టు 21 నుంచి ఉంటుంది. ఆగస్టు 24 నుంచి ప్రారంభిస్తారు.
ఇతర వివరాలకు వెబ్సైట్ www.tgbcstudycircle.cgg.gov.in లో గాని, టీజీ బీసీ స్టడీ సర్కిల్, రోడ్ నంబర్ 8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ అడ్రస్‌లో లేదా ఫోన్ 040-24071178, 7780359322 నంబర్లలో సంప్రదించవచ్చు.