Ram Charan | రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో నయనతార.. పవర్ఫుల్ పాత్రలో లేడీ సూపర్ స్టార్?
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘RC17’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి.
Ram Charan | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘RC17’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్‌గా ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో ఈ సినిమా కాస్టింగ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం జోరందుకుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో భాగం కానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో బలంగా టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె ఈ సినిమాలో కథానాయికగా కాకుండా, కథను మలుపు తిప్పే ఒక కీలకమైన, ఎంతో ప్రాధాన్యత కలిగిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
సాధారణంగా దర్శకుడు సుకుమార్ రాసుకునే ప్రతి పాత్రకు ఒక బలమైన గుర్తింపు, ప్రాముఖ్యత ఉంటాయి. ‘రంగస్థలం’ చిత్రంలో ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసిన సుకుమార్.. ‘RC17’లో కూడా నయనతార కోసం ఒక పవర్ఫుల్ రోల్‌ను సిద్ధం చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, నయన్ రాకతో ఈ ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ రావడం ఖాయం. మరోవైపు, తెలంగాణ నేపథ్యంలో సాగే పక్కా రూటెడ్ నేటివిటీ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార పాత్రపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

