iPhone Air | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తాజాగా నిర్వహించిన తన ఈవెంట్లో ఐఫోన్ 17 ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం విదితమే. అయితే ఇదే ఈవెంట్లో ఐఫోన్ ఎయిర్ పేరిట మరో ఐఫోన్ మోడల్‌ను కూడా లాంచ్ చేసింది. ఇది యాపిల్‌కు చెందిన ఎయిర్ సిరీస్‌లో వచ్చిన మొదటి ఐఫోన్ కావడం మాత్రమే కాకుండా, అత్యంత పలుచని ఐఫోన్ కావడం కూడా విశేషం. దీన్ని చాలా స్లిమ్ డిజైన్‌తో లాంచ్ చేశారు. కేవలం 5.6ఎంఎం మందాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. అద్భుతమైన డిజైన్‌తో ఆకట్టుకుంటోంది. ఐఫోన్ ఎయిర్ ఫోన్లో 6.5 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి ప్రొ మోషన్ ఫీచర్‌తోపాటు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. ఇక ఈ ఫోన్ డిస్ప్లేకు 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. అందువల్ల సూర్యకాంతిలోనూ ఈ ఫోన్‌ను స్పష్టంగా వీక్షించవచ్చు. అలాగే ఐఫోన్ 17 మోడల్లాగే దీనికి కూడా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్‌ను అందిస్తున్నారు.
ఐఫోన్ ఎయిర్ ను గ్రేడ్ 5 టైటానియంతో రూపొందించారు. అందువల్ల ఫోన్ కు అద్భుతమైన ప్రీమియం లుక్ వచ్చింది. హై గ్లాస్ ఫినిష్ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. ఐఫోన్ 17 లాగే దీనికి కూడా ముందు వైపు సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది. ఈ ఫోన్లో యాపిల్ ఎ19 ప్రొ ప్రాసెసర్‌ను ఇచ్చారు. వైఫై 7, బ్లూటూత్ 6 ను పొందవచ్చు. అయితే ఐఫోన్ ఎయిర్ ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఇ-సిమ్ మోడల్లోనే లభిస్తోంది. ఫోన్ లోపల స్పేస్‌ను ఆదా చేయడం కోసమే ఇలాంటి డిజైన్‌ను, ఇ-సిమ్‌ను మాత్రమే ఏర్పాటు చేశామని యాపిల్ తెలియజేసింది. ఈ ఫోన్‌కు వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. 12 మెగాపిక్సల్ ఆప్టికల్ క్వాలిటీ 2ఎక్స్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉంది. అలాగే ముందు వైపు 18 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.
సాధారణంగా సెల్ఫీలు, పోర్ట్రెయిట్ లేదా ల్యాండ్ స్కేప్ ఫొటోలు, వీడిలయోను చిత్రీకరించుకోవాలంటే ఫోన్‌ను నిలువుగా లేదా అడ్డంగా రొటేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఐఫోన్ ఎయిర్‌ను ఎలాంటి పొజిషన్లో ఉంచినా సరే సెల్ఫీలు, పోర్ట్రెయిట్, ల్యాండ్ స్కేప్ ఫొటోలు, వీడియోలను చాలా సులభంగా చిత్రీకరించుకోవచ్చు. ఈ ఫోన్ అత్యంత స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉన్నప్పటికీ బ్యాటరీ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, యూజర్లకు ఈ ఫోన్ ఒక రోజు మొత్తం బ్యాటరీ బ్యాకప్‌ను ఇచ్చేలా తీర్చిదిద్దామని యాపిల్ తెలియజేసింది. ఈ ఫోన్‌ను 256జీబీ, 512జీబీ, 1టీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో డిఫాల్ట్‌గా లభిస్తుంది. ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. డ్యయల్ సిమ్‌లను వేసుకోవచ్చు. కానీ రెండింటిలోనూ ఇ-సిమ్‌లనే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోన్లో అత్యంత వేగవంతమైన 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. గిగాబిట్ ఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. ఎన్ఎఫ్సీ సదుపాయం లభిస్తుంది.
ఐఫోన్ ఎయిర్ ఫోన్‌కు గాను 20 వాట్ల ఫాస్ట్ వైర్ లెస్ చార్జింగ్కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి ద్వారా మెయిన్ చార్జింగ్ చేసుకోవచ్చు. దీనికి 20 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్‌ను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. 30 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది. ఐఫోన్ ఎయిర్ ఫోన్‌ను స్పేస్ బ్లాక్, క్లౌడ్ వైట్, లైట్ గోల్డ్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్‌కు చెందిన 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,19,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,39,900గా ఉంది. 1టీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.1,59,900గా నిర్ణయించారు. ఐఫోన్ ఎయిర్ ఫోన్‌ను సెప్టెంబర్ 19వ తేదీ నుంచి విక్రయించనున్నారు. ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభించనున్నారు.