Amazon & Flipkart Sales | బతుకమ్మ, దసరా పండుగలు వచ్చేస్తుండటంతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లను తీసుకొచ్చేశాయి. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ సేల్స్‌లో భారీ ఆఫర్లు ప్రకటిస్తుండటంతో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఆత్రుతగా ఉన్నారు. ఈ క్రమంలోనే సామ్సంగ్,రియల్మీ కంపెనీకి చెందిన మొబైల్స్, ట్యాబ్లెట్స్ వాటి యాక్ససిరీస్ కొనుగోలు చేసే సమయంలో మోసపోకుండా ఉండేందుకు ప్రముఖ డీల్బీ డీల్స్ సంస్థ పలు సూచనలు చేసింది.
అమెజాన్‌లో సామ్సంగ్ మొబైల్స్ కొనుగోలు చేయాలని అనుకుంటే clicktech retail, STPL Exclusive, Darshital Etel సెల్లర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని డీల్బీ డీల్స్ సూచించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో అయితే TrueCom Retail, Mythanglory Retail, BTPLD, Flashstar Commerce సెల్లర్ల నుంచే కొనుగోలు చేయాలని చెప్పింది. ఇక యాక్ససిరీస్ విషయానికొస్తే Buzz India, SV Peripherals, Unique Click సెల్లర్ల నుంచే కొనుగోలు చేయాలని తెలిపింది. ట్యాబ్స్, నోట్ పీసీలు అయితే India Flash Mart, Retailnet నుంచే కొనుగోలు చేయాలని చెప్పింది. ఇవి మాత్రమే సామ్సంగ్ కంపెనీకి అఫిషియల్ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ సెల్లర్లు అని తెలిపింది. ఫేక్ సెల్లర్ల నుంచి కొనుగోలు చేసి మోసపోవద్దని హెచ్చరించింది.
ఇక రియల్మీ మొబైల్స్ విషయానికొస్తే.. అమెజాన్‌లో Darshita Etel సెల్లర్ నుంచే కొనుగోలు చేయాలని డీల్బీ డీల్స్ సూచించింది. అదే ఫ్లిప్‌కార్ట్‌లో BTPL, Partpritrade, Supercom, TAMS, Clientero, MPS, Srasra, Truene, MPD, Sthenios Ecommerce, Grahgoods, Xonight, Visionstar సెల్లర్ల నుంచే కొనుగోలు చేయాలని తెలిపింది.