Bigg Boss 9| బిగ్‌బాస్ సీజన్ తాజా ఎపిసోడ్లో మొదటి వారం నామినేషన్లు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కామనర్లు, సెలబ్రిటీలు ఇద్దరూ వ్యూహాత్మకంగా నామినేట్ చేస్తూ గేమ్‌ను హీటెక్కించారు. ముఖ్యంగా సంజనకి ఎక్కువమంది నామినేషన్ వేయడం గమనార్హం. మానిటర్ సూచనలు పట్టించుకోకుండా ఆమె ప్రవర్తించిన తీరు, ఇతర హౌస్మేట్లకు ఆగ్రహం తెప్పించినట్లు కనిపించింది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రారంభంలో సుత్తి గేమ్‌లో భరణి-ఇమ్మానుయేల్ పోటీపడ్డారు. చివరికి భరణి గెలిచి, తన నామినేషన్ పవర్‌ను ఉపయోగించి సంజనను నామినేట్ చేశాడు. ఆ తర్వాత సుత్తిని శ్రీజకి అందజేశాడు.
శ్రీజ ముందుగా సంజనపై నిప్పులు చెరిగింది. “షాంపూ బాటిల్ బాత్రూంలో పెట్టడం వల్లే ఇబ్బంది అయ్యింది. మా మాట వినకుండా మీరు మీ స్టాండ్ మీదే ఉంటానన్నారుగా.. అది అసలు స్టాండ్యే కాదు” అని సంజనపై ఫైర్ అయింది. దీంతో పాటు తనూజను కూడా నామినేట్ చేస్తూ, ఆమె గత కొన్ని రోజులుగా తాను వేసే కామెంట్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ క్రమంలో తనూజ తనపై వస్తున్న ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. “మేమూ మనుషులమే.. ఒక్కసారి మీరు చెబితే సరిపోతుంది.. ప్రతి ఒక్కరు వచ్చి అదే మాటలు చెబితే ఎలా?” అంటూ ఘాటుగా స్పందించింది.
శ్రీజ వంట గురించి చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో పవన్ .. “నువ్వు మనుషుల్లా చూడట్లేదు” అనడంతో తనూజ కాస్త నొచ్చుకున్నట్టు ప్రోమోలో స్పష్టమైంది. ఈ ఉద్రిక్త వాతావరణంలో హరీష్ మాట్లాడుతూ.. “నీ దయా దాక్షిణ్యాల మీద మేము బతుకుతున్నామా?” అంటూ తనూజపై ఫైర్ అయ్యాడు.దీనికి కౌంటర్‌గా తనూజ.. “నా బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు” అంటూ గట్టిగానే స్పందించింది. అయితే అదే సమయంలో భరణి మాస్క్‌మ్యాన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు, అయితే ఇమ్మానుయేల్ అతన్ని అడ్డుకున్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత, సుమన్ శెట్టితో మాట్లాడుతూ తనూజ భావోద్వేగానికి లోనయ్యింది. నామినేషన్ వలన కాదు… కానీ ఒక ఆడ పిల్ల బిహేవియర్ గురించి ఇలా మాట్లాడడం బాధిస్తోంది. బయట ప్రపంచంలో ఇది ఎలా ప్రభావం చూపుతుంది అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌గా మారింది.