Banduan Teaser | తమిళ నటుడు కార్తీ, స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఖైదీ’ యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇదే చిత్రం ఇప్పుడు మాలే(మలేషియా అధికార భాష)లో ‘బందువన్’ అనే పేరుతో రీమేక్ అవుతోంది. ఈ సినిమాకు ‘క్రోల్ ఆజ్రీ’ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆరోజ్ అజిజ్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది.