The Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్’ (The Raja Saab) నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. సినిమా రిలీజ్ డిసెంబర్ నుంచి సంక్రాంతికి పోస్ట్ పోన్ అయినప్పటికీ, ఇప్పుడు వరుసగా ట్రైలర్, పాట రిలీజ్ డేట్లను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 2న విడుదల కానున్న పాన్ ఇండియా మూవీ ‘కాంతార: ఎ లెజెండ్’ (Kantara: A Legend) థియేట్రికల్ రన్‌తో పాటు, ‘ది రాజా సాబ్’ ట్రైలర్‌ను థియేటర్లలో స్క్రీన్ చేయనున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.అయితే యూట్యూబ్‌లో అక్టోబర్ 1న ది రాజా సాబ్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా, ‘ది రాజా సాబ్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. సంగీత దర్శకుడు థమన్ కంపోజ్ చేస్తున్న ఈ పాటపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. “ఫ్యాన్స్‌కి ఇది పక్కా బర్త్‌డే గిఫ్ట్ అవుతుంది అని విశ్వప్రసాద్ అన్నారు. ఇక మూవీని జనవరి 9,2026న సంక్రాంతి స్పెషల్‌గా విడుదల చేయనున్నట్టు సమాచారం. తొలుత డిసెంబరులో రావాల్సిన ‘ది రాజా సాబ్’ ఇప్పుడు 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ సినిమాలకు సంక్రాంతి సీజన్ మంచి హిట్ ట్రాక్ రికార్డు కలిగి ఉండటం విశేషం.
మారుతి దర్శకత్వం వహించిన ‘ది రాజా సాబ్’ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సప్తగిరి వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీనుతో పాటు బొమ్మన్ ఇరానీ తదితరులు ఇతర కీలక పాత్రలలో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.