iPhone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్లో లాంచ్ చేసింది. గతేడాది రిలీజ్ అయిన ఐఫోన్ 16కు కొనసాగింపుగా ఐఫోన్ 17 మోడల్‌ను లాంచ్ చేశారు. ఐఫోన్ 17లో గత ఫోన్‌తో పోలిస్తే పెద్ద డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో 6.3 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్ప్లేను అమర్చారు. అలాగే దీనికి ప్రొ మోషన్ ఫీచర్ లభిస్తుంది. కనుక డిస్ప్లేను 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌కు సెట్ చేసుకోవచ్చు. దీని వల్ల డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అద్భుతమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా వీక్షించేలా ఈ డిస్ప్లేకు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తున్నారు. అందువల్ల ఐఫోన్ 16 కన్నా ఐఫోన్ 17 డిస్ప్లే 50 శాతం ఎక్కువ కాంతివంతంగా, నాణ్యంగా ఉంటుంది.
ఐఫోన్ 17 లో ప్రొ మోషన్తోపాటు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఫోన్ డిస్ప్లేపై యూజర్లు టైమ్, విడ్జెట్స్, లైవ్ యాక్టివిటీలను ఎప్పటికప్పుడు సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ లో యాపిల్ ఎ19 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇది యాపిల్ ఎ15 బయానిక్ ప్రాసెసర్ కన్నా 1.5 రెట్లు వేగంగా పనిచేస్తుందని యాపిల్ తెలియజేసింది. ఈ ఫోన్లో వైఫై 7తోపాటు బ్లూటూత్ 6 లభిస్తుంది. దీని వల్ల కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ 17కు చెందిన ఇ-సిమ్ ఓన్లీ మోడల్‌ను బహ్రెయిన్, కెనడా, గువామ్, జపాన్, కువైట్, మెక్సికో, ఓమన్, కతార్, సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాలలో విక్రయించనున్నారు. ఇక ఈ ఫోన్‌కు వెనుక వైపు 48 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. అలాగే మరో 48 మెగాపిక్సల్ ఆప్టికల్ క్వాలిటీ 2ఎక్స్ టెలిఫొటో కెమెరా కూడా ఉంది. ముందు వైపు 18 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ కెమెరాల సహాయంతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు. ముందు, వెనుక ఉన్న కెమెరాలతో ఒకేసారి వీడియోలను, ఫొటోలను చిత్రీకరించుకునే విధంగా సదుపాయాన్ని అందిస్తున్నారు.
ఐఫోన్ 17కు గాను డిస్ప్లేకు సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. అందువల్ల డిస్ప్లే దృఢంగా ఉంటుంది. ఈ ఐఫోన్‌కు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు. యూఎస్టీ టైప్ సి పోర్టు ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. 40 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్‌ను కేవలం 20 నిమిషాల్లోనే 50 శాతం వరకు చార్జింగ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 17ను 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఐఓఎస్ 26 ఇందులో లభిస్తుంది. ఐపీ 68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది. ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే నానోసిమ్, ఇ-సిమ్ మోడల్ ఫోన్ లభిస్తుంది. మిగిలిన దేశాల్లో కేవలం ఇ-సిమ్ ఓన్లీ మోడల్‌ను మాత్రమే విక్రయించనున్నారు. ఈ ఐఫోన్లో 5జి సేవలను అత్యంత గరిష్ట స్పీడ్‌తో ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, ఎన్ఎఫ్సీ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌కు 25 వాట్ల ఫాస్ట్ వైర్ లెస్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది.
ఐఫోన్ 17ను బ్లాక్, వైట్, మిస్ట్ బ్లూ, సేజ్, లావెండర్ కలర్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. ఇందులో 128జీబీ మోడల్ లేదు. ఇక ఐఫోన్ 17కు చెందిన 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.82,900 ఉండగా, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.1,02,900గా ఉంది. ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించారు. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.