23.68 టీఎంసీలు విడుదల చేయండి
- కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కారు ఇండెంట్
- నేడు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఈ నెల 15 వరకు ఇంకో 23.68 టీఎంసీల నీరు ఉపయోగించుకొనేందుకు అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను కోరింది. గతంలో ఏపీకి 207 టీఎంసీలను కేటాయించారు. ఇందులో నవంబర్ 30 వరకు ఈ రెండు ప్రాజెక్టుల నుంచి 183.32 టీఎంసీల నీటిని ఉపయోగించుకున్నామని ఏపీ తన ఇండెంట్లో వెల్లడించింది. ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీళ్లు సముద్రంలోకి పోయే రోజుల్లో అదనంగా 32.16 టీఎంసీలు తీసుకున్నామని తెలిపింది. దీంతో ఏపీ మొత్తం 215.48 టీఎంసీలను వాడుకున్నది.
ఈ నెల 15 వరకు నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి 11.77 టీఎంసీలు, ఎడమ కాలువ నుంచి 2.55, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5.22, హంద్రీనీవా నుంచి 4.14 టీఎంసీలు తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే, కృష్ణా డెల్టా సిస్టం కింద ఎంత నీటిని ఉపయోగించుకున్నదో ఏపీ చెప్పలేదు. యాసంగి సీజన్ సాగు అవసరాల వివరాలను సైతం పొందుపరచలేదు. గురువారం వెబినార్ ద్వారా నిర్వహించే కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీలో ఇండెంట్‌పై చర్చించి, నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వనున్నారు. తెలంగాణ తన ఇండెంట్ గురువారం ఉదయం ఇచ్చే అవకాశమున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

