AP CM | అది గొడ్డలి పార్టీ అనడానికి ఇవిగో 11 నిదర్శనాలు.. వైసీపీపై ఏపీ సీఎం ఫైర్
AP CM | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాలవల్లే వైసీపీని తాను 'గొడ్డలి పార్టీ' అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీయేనని స్పష్టంచేశారు.
AP CM : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కండ్రిగలో జరిగిన సంజీవని ప్రజావేదిక సభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ 11 విషయాలు చెబుతానంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన 11 అరాచక, విధ్వంసకర ఘటనలను ఏకరువు పెట్టారు. ఈ నిర్వాకాలవల్లే వైసీపీని తాను ‘గొడ్డలి పార్టీ’ అని పిలుస్తున్నానని, ఆ పార్టీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీయేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటులేదని, సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని వ్యాఖ్యానించారు. ‘గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్’ అంటూ చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ గొడ్డలి పార్టీ అనడానికి నిదర్శనాలుగా చంద్రబాబు పేర్కొన్న 11 అంశాలు కింది విధంగా ఉన్నాయి.
1. వివేకా హత్య, నాటకాలు – అంతిమ లబ్దిదారు ఎవరో ప్రతి ఒక్కరికీ తెలుసు..
2. కోడికత్తి డ్రామా.. గులకరాయి డ్రామా – ప్రజలను మోసం చేసే ఎత్తుగడ..
3. దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య, డోర్ డెలివరీ – నిందితుడికి వైసీపీ అండదండలు..
4. మాస్క్ అడిగిన దళిత డాక్టర్పై దాడి – వేధించి ప్రాణాలు తీసిన వైసీపీ ప్రభుత్వం..
5. కుటుంబబంధాలపై గొడ్డలి వేటు – ఆస్తి ఇవ్వకుండా తల్లికి, చెల్లికి అన్యాయం..
6. హిందూ దేవుళ్లపై అకృత్యాలు, అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు..
7. పోలవరం, అమరావతి, పెట్టుబడులు, అభివృద్దిపై గొడ్డలి పార్టీ వేటు..
8. నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్యల పీకలు కోసేంత రక్త దాహంతో వైసీపీ..
9. గంజాయి బ్యాచ్లకు ప్రోత్సాహం.. రప్పా రప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు..
10. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను తొక్కించారు.. కడపలో పెద్ద దస్తగిరిని చంపేశారు..
11. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుకు రోజుకో నాటకం.. పాస్టర్లతో దాడి డ్రామాలు..
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- ap cm
- Axe Party
- chandra babu
- ycp
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

